

తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రియా భవానీ శంకర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల రవితేజ సరసన ఇరుముడి చిత్రంలో నటించిన ఈ బ్యూటీ.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. దశాబ్దానికి పైగా ప్రేమలో ఉన్న ప్రియుడు రాజ్‌వెల్ రాజ్‌తో కలిసి ఆమె కొన్ని ప్రత్యేకమైన చిత్రాలను షేర్ చేయడంతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం మొదలైంది. ఈ ఫొటోలు వైరల్ కావడంతో అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ప్రియా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో సంప్రదాయ దుస్తులు ధరించి, మెడలో మల్లెపూల దండలతో రాజ్‌వెల్‌తో కలిసి ఉన్న ఫొటోలను పంచుకున్నారు. అంతేకాకుండా చేతులకు గోరింటాకు పెట్టుకున్న చిత్రాలను కూడా షేర్ చేశారు. వీటికి తోడు వివాహ వేడుకను తలపించే సంగీతం ఉండటంతో అభిమానులు ఇవి నిశ్చితార్థం లేదా పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలని భావిస్తున్నారు. కాలేజీ రోజుల్లో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారింది. 2020లో ప్రియా తమ ప్రేమ బంధాన్ని బహిరంగంగా వెల్లడించారు. 2022లో ఈ జంట చెన్నైలో సముద్రానికి ఎదురుగా తమ కలల ఇంటిని కొనుగోలు చేశారు. 2024లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 2025లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉందని ప్రియా తెలిపారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫొటోలు నిజంగానే పెళ్లి వేడుకలకు సంబంధించినవా? వివాహ తేదీ ఎప్పుడు? అనే విషయాలపై స్పష్టత రావాలంటే ప్రియా అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!