
సినిమాలు

రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న RAPO23 సినిమా విడుదల విషయంలో కీలక మార్పు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావించారు. అయితే మధ్యలో సూపర్ స్టార్ ధర్మన్ సినిమాలో నటించే అవకాశం రావడంతో ప్రణాళికలు మారిపోయినట్లు సమాచారం. దీంతో RAPO23 విడుదలను వాయిదా వేయక తప్పడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కూడా ఆశించిన స్థాయిలో పూర్తికాలేదని తెలుస్తోంది. ఇప్పటివరకు కేవలం 40 శాతం షూటింగ్ మాత్రమే పూర్తయినట్లు సమాచారం.మిగిలిన భాగాన్ని పూర్తి చేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో వచ్చే ఏడాదికి విడుదలను మార్చినట్లు ప్రచారం జరుగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!