

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాకా సినిమా విడుదలకు ముందే వ్యాపార వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ హక్కుల విషయంలో మేకర్స్ భారీ ధరను ఆశిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల కోసం ఏకంగా రూ.70 కోట్లు కోట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ ధర విషయంలో ఎలాంటి తగ్గింపునకు నిర్మాతలు సిద్ధంగా లేరని వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి మాస్ ఇమేజ్, బాబీ కొల్లి దర్శకత్వంపై ఉన్న నమ్మకంతో ఈ స్థాయిలో బిజినెస్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా 2027 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ బిజినెస్ వ్యవహారాలు మాత్రం ఇప్పుడే వేడెక్కుతున్నాయి. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దక్కించుకోవడానికి ఏ పంపిణీ సంస్థ ముందుకొస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రూ.70 కోట్ల ఒప్పందం కుదిరితే కాకా బిజినెస్‌లో కీలక మైలురాయిగా నిలవనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!