

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న బ్లడీ రోమియో సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా శాశ్వత్ సచ్‌దేవ్ అధికారికంగా ఎంపికైనట్లు సమాచారం. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుకు సంగీతం అందిస్తారని భావించిన ప్రవీణ్ లక్కరాజును మార్చి ఆయన స్థానంలో శాశ్వత్ సచ్‌దేవ్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ధురంధర్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న శాశ్వత్ సచ్‌దేవ్ ఇప్పుడు నాని చిత్రానికి పనిచేయనుండటం ఆసక్తిని పెంచుతోంది. ఈ మార్పుతో సినిమాపై సంగీత పరంగా కూడా కొత్త అంచనాలు మొదలయ్యాయి.
అయితే సంగీత దర్శకుడిని అకస్మాత్తుగా మార్చడానికి గల కారణాలు మాత్రం ఇంకా వెల్లడికాలేదు. చిత్ర బృందం నుంచి కూడా దీనిపై పూర్తి వివరాలు బయటకు రాలేదు. మరోవైపు శాశ్వత్ సచ్‌దేవ్ రాకతో బ్లడీ రోమియో పాటలు, నేపథ్య సంగీతం ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!