

ఈ వీకెండ్ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధమయ్యాయి. నవంబర్ 6 శుక్రవారం ఒక్కరోజే వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్‌లు పలు ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్‌కు రానున్నాయి. వీటిలో ‘ఐ యామ్ గేమ్’, ‘మీసయ్య మురుక్కు’, ‘హైవాన్’, ‘ది వాన్’ వంటి చిత్రాలు ఉన్నాయి. నవంబర్ 8న కూడా కొన్ని కొత్త కంటెంట్ విడుదల కానుంది. ఏ సినిమా ఏ ఓటీటీలో అందుబాటులోకి వస్తుందో తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్‌లో బెంగాలీ సిరీస్ ‘కౌరిబురీర్ మందిర్’, కొరియన్ మూవీ ‘పాజిబుల్ లవ్’, కొలంబియన్ సిరీస్ ‘అండర్ సీజ్’ నవంబర్ 6న విడుదల కానున్నాయి. జియో హాట్‌స్టార్‌లో అదే రోజు తెలుగు డబ్బింగ్ చిత్రం ‘ఐ యామ్ గేమ్’, నవంబర్ 8న ‘మోటూ పత్లూ అండ్ మిస్టరీ ఆఫ్ ఏ నాగమణి’ స్ట్రీమింగ్ కానున్నాయి. జీ5లో ‘నూర్ కోడివానవిళ్’, సోనీ లివ్‌లో ‘హైవాన్’, ‘మీసయ్య మురుక్కు’ అందుబాటులోకి రానున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ది వాన్’, ‘ఓట్టమ్ తుల్లాల్’ నవంబర్ 6న, ‘ది ఇన్‌స్టిట్యూట్’ సీజన్ 2 నవంబర్ 8న విడుదల కానున్నాయి. సన్ నెక్ట్స్‌లో ‘బా బా బ్లాక్ షీప్’, ‘ఐసీయూ’, ‘ది గ్రాండ్ మాస్టర్’ నవంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!