

‘రామాయణం: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్’ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ప్రీమియర్ షోల నుంచి పాజిటివ్ స్పందన రావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ప్రతిష్ఠాత్మక పౌరాణిక చిత్రానికి నితేశ్ తివారీ దర్శకత్వం వహించారు. భారత్‌లో గత రాత్రి కొన్ని ప్రత్యేక ప్రదర్శనలు కూడా నిర్వహించగా, వాటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చినట్లు సమాచారం. ప్రారంభ టాక్ సానుకూలంగా ఉండటంతో పెద్ద తెరపై ఈ విజువల్ గ్రాండియర్‌ను వీక్షించేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సుమారు రూ.2,000 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు సమాచారం. అత్యున్నత స్థాయి విజువల్స్‌తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఓపెనింగ్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రారంభ స్పందన కూడా బాక్సాఫీస్‌పై అంచనాలను పెంచింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు హాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. నమిత్ మల్హోత్రా, యశ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ పరీక్షను ఎదుర్కోనుంది. తొలిరోజు వసూళ్లు ఎంత నమోదవుతాయి, ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందనే దానిపై అందరి దృష్టి నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!