

ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వసూళ్ల విషయంలో ‘రామాయణ’ సినిమా సరికొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తున్నట్లు ట్రేడ్ వర్గాల గణాంకాలు చెబుతున్నాయి. విడుదలైన 18 రోజుల్లో ఈ చిత్రం రూ.1,725 కోట్ల వసూళ్లు సాధించి అగ్రస్థానంలో నిలిచినట్లు సమాచారం. ఇదే సమయంలో ‘ధురంధర్ 2’ రూ.1,625 కోట్లు, ‘పుష్ప 2: ది రూల్’ రూ.1,536 కోట్లు, ‘బాహుబలి 2’ రూ.1,451 కోట్ల వసూళ్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఇక ‘ఆర్ఆర్ఆర్’ రూ.1,070 కోట్లు, ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ రూ.1,065 కోట్లు, ‘జవాన్’ రూ.1,005 కోట్లు, ‘కల్కి 2898 ఏడీ’ రూ.945 కోట్ల వసూళ్లు సాధించినట్లు పేర్కొంటున్నారు. ఈ లెక్కల ప్రకారం ‘రామాయణ’ వసూళ్లలో తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. ఇదే జోరు కొనసాగితే ‘పుష్ప 2’ జీవితకాల వసూళ్లను అధిగమించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ‘బాహుబలి 2’, ‘ధురంధర్ 2’ రికార్డులను కూడా దాటుతుందా అన్న ఆసక్తి సినీ అభిమానుల్లో నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!