

ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల విషయంలో ‘రామాయణ’ సినిమా సంచలన ప్రదర్శన కొనసాగిస్తోంది. విడుదలైన తొలి 12 రోజుల్లోనే ఈ చిత్రం రూ.1,415.75 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, భారతీయ చిత్రాల జాబితాలో అగ్రస్థానానికి చేరినట్లు సమాచారం. ఇదే సమయంలో ‘ధురంధర్ 2’ రూ.1,392 కోట్లు, ‘పుష్ప 2: ది రూల్’ రూ.1,334.86 కోట్లు వసూలు చేశాయి. ‘బాహుబలి 2’ రూ.1,200 కోట్లు, ‘ఆర్ఆర్ఆర్’ రూ.950 కోట్లు, ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ రూ.915 కోట్లు నమోదు చేశాయి. ‘జవాన్’ రూ.884 కోట్లు, ‘కల్కి 2898 ఏడీ’ రూ.855 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
తొలి 12 రోజుల వసూళ్లను పోల్చి చూస్తే, ‘ధురంధర్ 2’ కంటే ‘రామాయణ’ రూ.23.75 కోట్ల ఆధిక్యంలో ఉండటం విశేషం. ఈ రెండు చిత్రాల మధ్య వసూళ్ల పోటీ ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాబోయే రోజుల్లో ‘రామాయణ’ కలెక్షన్లు మరింత పెరుగుతాయా? ఈ చిత్రం చివరకు ఎలాంటి రికార్డులను సృష్టిస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!