

విశాఖపట్నంలో ప్రకృతి అందాలు, పచ్చదనం క్రమంగా కనుమరుగవుతున్న తీరుపై హీరోయిన్ చాందిని చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో జరుగుతున్న పర్యావరణ మార్పులపై ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అయితే ఆమె వ్యాఖ్యలపై కొందరు టీడీపీ మద్దతుదారుల సోషల్ మీడియా ఖాతాల నుంచి విమర్శలు, ట్రోలింగ్ పోస్టులు వెలువడినట్లు తెలుస్తోంది. దీంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. విశాఖలో ప్రకృతి సంపదకు జరుగుతున్న నష్టంపై స్పందించడం తప్పెలా అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తన అభిప్రాయాలను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని చాందిని చౌదరి స్పష్టం చేశారు. జరుగుతున్న వాస్తవాలను ప్రశ్నిస్తే రాజకీయ విమర్శలు చేయడం సమంజసం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రకృతి పరిరక్షణ అనేది రాజకీయాలకు అతీతమైన అంశమని పేర్కొన్నారు. విశాఖ అభివృద్ధి ఎంత ముఖ్యమో, నగరంలోని పచ్చదనం, ప్రకృతి సంపదను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. అభివృద్ధి పేరుతో పర్యావరణానికి నష్టం కలగకుండా చూడాల్సిన అవసరాన్ని ఈ పరిణామం గుర్తుచేస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!