

ఒప్పో తన కొత్త ప్యాడ్ ఎయిర్6 ట్యాబ్లెట్‌ను చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. రెనో17 స్మార్ట్‌ఫోన్ సిరీస్‌తో పాటు ఈ ట్యాబ్లెట్‌ను పరిచయం చేసింది. విద్యార్థులు, ఆన్‌లైన్ క్లాసులు వినేవారు, మల్టీమీడియా కంటెంట్ చూసేవారిని దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించింది. ఇందులో 2800 × 1980 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో కూడిన 12.1 అంగుళాల 2.8K డిస్‌ప్లేను అందించారు. ఇది గరిష్ఠంగా 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. వినియోగాన్ని బట్టి 30Hz, 60Hz, 90Hz, 120Hz మధ్య ఆటోమేటిక్‌గా మారుతుంది. బ్రైట్ ఐ సాఫ్ట్ లైట్ స్క్రీన్ టెక్నాలజీ, మ్యాట్ తరహా ఫినిషింగ్, హై బ్రైట్‌నెస్ మోడ్‌లో 900 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ట్యాబ్లెట్ మందం 6.89 మిల్లీమీటర్లు కాగా, ఆండ్రాయిడ్ 17 ఆధారిత కలర్‌ఓఎస్ 17పై పనిచేస్తుంది.
విద్యార్థుల కోసం అప్‌గ్రేడ్ చేసిన ఒప్పో నోట్స్ యాప్‌లో చేతిరాతతో నోట్స్ రాసుకోవడం, పీడీఎఫ్ ఫైళ్లను ఇంపోర్ట్ చేయడం, డాక్యుమెంట్లపై రాయడం, ఫొటోలు జోడించడం, ఆడియో రికార్డింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7360 సూపర్ 4nm ప్రాసెసర్, ఆర్మ్ మాలి-G615 జీపీయూతో ఈ ట్యాబ్లెట్ పనిచేస్తుంది. 8GB, 12GB LPDDR5X ర్యామ్‌తో పాటు 128GB, 256GB UFS 3.1 స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. ముందు, వెనుక భాగాల్లో 8MP కెమెరాలు, నాలుగు స్పీకర్లు, రెండు మైక్రోఫోన్లు ఉన్నాయి. వై-ఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్-సీ, ఒప్పో స్మార్ట్‌ఫోన్ ద్వారా 5G డేటా షేరింగ్ సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇందులో 10,050mAh బ్యాటరీని అందించగా, 33W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
చైనాలో నవంబర్ 20 నుంచి OPPO Pad Air6 అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర 3,099 యువాన్లు. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో మ్యాట్ డిస్‌ప్లే మోడల్ ధర 4,299 యువాన్లుగా నిర్ణయించారు. లాంచ్ సందర్భంగా పరిమిత కాల ఆఫర్‌లో బేస్ మోడల్‌ను 2,599 యువాన్లకు అందించనున్నారు. అర్హత కలిగిన ప్రభుత్వ సబ్సిడీలు వర్తిస్తే ధర 2,209.15 యువాన్లకు తగ్గనుంది. ప్రస్తుతానికి ఈ ట్యాబ్లెట్ చైనా మార్కెట్‌కే పరిమితమైంది. భారత్‌లో విడుదలపై ఒప్పో ఎలాంటి ప్రకటన చేయలేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!