
రాజకీయాలు

ఇటీవల హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో నేపాలీ గ్యాంగ్స్ సృష్టిస్తున్న నేర ఘటనలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య ఘటనతో ఈ ముఠాల ఆగడాలు మరింత వెలుగులోకి వచ్చాయి. ఈ పరిణామాలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దృష్టి సారించినట్లు సమాచారం. ఈ నిజ ఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
రియల్ లైఫ్ కథలను తనదైన శైలిలో తెరపైకి తీసుకురావడంలో వర్మకు ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో అనేక ప్రాజెక్టులు ప్రకటించినప్పటికీ అవి అమలులోకి రాలేదు. ఈ నేపథ్యంలో నేపాలీ ముఠాల కథ అయినా సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో అన్న ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!