
క్రీడలు

చాలామందికి ఆదివారం నాన్ వెజ్ తినడం అలవాటు. చికెన్ త్వరగా ఉడికిపోతుంది కానీ మటన్ ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది. ముఖ్యంగా ముదురు మటన్ అయితే ఇంకా ఆలస్యం అవుతుంది. అయితే కొన్ని సులభమైన గృహ చిట్కాలతో మటన్‌ను త్వరగా మెత్తగా ఉడికించుకోవచ్చు.
మటన్‌ను చల్లటి నీటితో కాకుండా గోరువెచ్చని నీటితో కడగాలి. ముదురు మటన్ అయితే పసుపు, పెరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్‌తో 5–6 గంటలు నానబెట్టాలి. వంట సమయంలో కొద్దిగా నూనె వేయడం వల్ల మాంసం త్వరగా మెత్తబడుతుంది. లేత మటన్‌కు నిమ్మరసం ఉపయోగిస్తే ఇంకా త్వరగా ఉడుకుతుంది. శుభ్రపరిచే విధానం, తాజా మాంసం ఎంపిక కూడా ముఖ్యమే.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించండి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!