
సినిమాలు

బొంబాయి రవ్వ, బెల్లం, నెయ్యి, తురిమిన కొబ్బరి, యాలకుల పొడి మరియు డ్రైఫ్రూట్స్‌తో రుచికరమైన రవ్వ లడ్డూలను సులభంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి రవ్వను మీడియం మంటపై బాగా వేయించాలి. రవ్వ కాలిపోకుండా నిరంతరం కలుపుతూ సువాసన వచ్చే వరకు వేయించాలి.
తరువాత అదే మిశ్రమంలో కొబ్బరి తురుమును వేసి కొద్ది నిమిషాలు వేయించాలి. మరో పాన్‌లో జీడిపప్పు, కిస్మిస్‌ను నెయ్యిలో బంగారు రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టాలి. చల్లారిన తర్వాత రవ్వలో బెల్లం, యాలకుల పొడి కలిపి కొద్దిగా గ్రైండ్ చేయాలి. తరువాత డ్రైఫ్రూట్స్, నెయ్యి కలిపి చిన్న లడ్డూలుగా తయారు చేసి ఆరనివ్వాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!