

మారుతున్న జీవనశైలిలో ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత తగ్గుతున్న వేళ, వాల్నట్స్ వంటి పోషకాహారాలను రోజువారీ డైట్లో చేర్చడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. వాల్నట్స్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఈ, మెగ్నీషియం, ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగడానికి ఇవి దోహదం చేస్తాయి.
అలాగే వాల్నట్స్లో అధికంగా ఉన్న పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ప్రోటీన్, ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగించి ఆకలిని నియంత్రిస్తాయి. దీంతో బరువు నియంత్రణకు కూడా ఇవి సహాయపడతాయి. మెగ్నీషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు శరీరానికి అవసరమైన పోషణను అందిస్తాయి. క్రమం తప్పకుండా వాల్నట్స్ తీసుకోవడం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!