

ఉసిరిలో నారింజల కంటే సుమారు 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. మునగాకులోని ఐరన్, క్యాల్షియంతో కలిసినప్పుడు ఇది శరీరంలో ఐరన్ శోషణను మెరుగుపరుస్తుంది. ఈ సహజ మిశ్రమం సింథటిక్ సప్లిమెంట్ల అవసరం లేకుండా రోగనిరోధక శక్తిని, శక్తి స్థాయిలను పెంచుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి గ్యాస్ట్రిక్ జ్యూస్‌లు, లివర్ ఎంజైమ్‌లను ఉత్తేజపరుస్తుంది. మునగాకులోని యాంటీబాక్టీరియల్ గుణాలు పేగుల ఆరోగ్యాన్ని కాపాడి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.
క్వెర్సెటిన్, క్లోరోజెనిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాలను రక్షించి ఏకాగ్రతను పెంచుతాయి. కాలేయంలో కొవ్వు తగ్గించి గ్లుటాథియోన్ స్థాయిలను పెంచి డిటాక్స్ చేస్తుంది. ఇందులోని అమైనో ఆమ్లాలు కండరాల పునరుద్ధరణకు సహాయపడతాయి. చర్మం మెరుగు, జుట్టు బలానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి. అలాగే బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. తయారీకి ఉసిరి, మునగాకు, కరివేపాకు, జీలకర్ర, మిరియాలు, అల్లం, పసుపు, నీరు కలిపి గ్రైండ్ చేసి వడకట్టి పింక్ సాల్ట్ కలిపి ప్రతి ఉదయం తీసుకోవచ్చు.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు లేదా ఆహార మార్పులకు ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోండి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!