

నందమూరి బాలకృష్ణ సినీ ప్రస్థానం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణతో కలిసి సినిమా చేయాలని దర్శకుడు బోయపాటి శ్రీనుకు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనపై అప్పట్లో భారీ ఆసక్తి నెలకొంది. తాజాగా తిరుమల పర్యటనలో బోయపాటి శ్రీను ఈ అంశంపై స్పందించారు. చిరంజీవి, బాలకృష్ణలను కలిపి సినిమా చేయాలనే ఆలోచన కచ్చితంగా కార్యరూపం దాల్చాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున తెలుగు సినీ పరిశ్రమకు నాలుగు స్తంభాల్లాంటి వారని బోయపాటి పేర్కొన్నారు. చిరంజీవి, బాలకృష్ణలను కలిసి దర్శకత్వం వహించే అవకాశం రావడం తనకు గౌరవంగా ఉంటుందని, అది మరో స్థాయి అవకాశమని అన్నారు. అయితే ఇద్దరు అగ్ర కథానాయకులను ఒకే సినిమాలోకి తీసుకురావాలంటే వారి డేట్లు, కథ, ఇతర బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని పక్కా ప్రణాళిక అవసరమని తెలిపారు. ప్రస్తుతం ఈ మల్టీస్టారర్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. చిరంజీవి ‘కాకా’ చిత్రంతో, బాలకృష్ణ ‘దాదా’ చిత్రంతో బిజీగా ఉన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!