

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వీరా కొగటం దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన పూజా కార్యక్రమాలతో సినిమా ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టగా, దర్శకుడు సుకుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సన్నివేశానికి దర్శకుడు బన్నీ వాస్ దర్శకత్వం వహించారు. పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది.
తాజాగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. పోస్టర్‌లో గుర్రం, కోడిపుంజు ఈకలు కనిపిస్తుండటంతో ఈ చిత్రం మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. సుకుమార్ రైటింగ్స్, వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథ, ఇతర నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన పూర్తి వివరాలను చిత్రబృందం త్వరలో వెల్లడించనుంది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!