

తమిళ చిత్రసీమలో రాజకీయాలు, సినిమాల మధ్య సంబంధం మరింత బలపడుతున్న వేళ నటుడు, సంగీత దర్శకుడు, నిర్మాత జీవీ ప్రకాష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ విజయం సాధించిన తర్వాత పలువురు సినీ ప్రముఖులు రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో జీవీ ప్రకాష్ వ్యాఖ్యలు కూడా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తన సినీ ప్రయాణం మరో 15 లేదా 16 సంవత్సరాలు కొనసాగుతుందో లేదో చెప్పలేనని జీవీ ప్రకాష్ తెలిపారు. అయితే ఆ తర్వాత తన దృష్టిని పూర్తిగా ప్రజాసేవపై కేంద్రీకరిస్తానని చెప్పారు. తన ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణమైన వేదిక లభిస్తే వారితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. ఆయన ఏ రాజకీయ పార్టీ పేరు ప్రస్తావించకపోయినా, ఈ వ్యాఖ్యలతో భవిష్యత్తులో రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!