

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో రూపొందుతున్న ‘వారణాసి’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచగా, ఇప్పుడు క్లైమాక్స్‌కు సంబంధించిన వార్తలు సినీ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో ఈ క్లైమాక్స్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం. భావోద్వేగం, సాహస గాథ, అద్భుత విజువల్ ప్రభావం అన్నీ కలిసేలా రాజమౌళి ప్రత్యేకంగా ఈ భాగాన్ని తెరకెక్కిస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
మంచు పర్వతాలు, ప్రకృతి వైపరీత్యాల మధ్య సాగే యాక్షన్ ఘట్టాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేలా ఉండనున్నాయని తెలుస్తోంది. మహేష్ బాబు రుద్రతో పాటు శ్రీరాముడి పాత్రల్లో ద్విపాత్రాభినయం చేయగా, ప్రియాంక మందాకినిగా కనిపించనున్నారు. రూ.1300 కోట్లకు పైగా వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కెఎల్ నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందిస్తుండగా, విజయేంద్ర ప్రసాద్ కథను రూపొందించారు. దేవా కట్టా సంభాషణలు అందిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ విడుదలకు ముందే దేశవ్యాప్తంగా విశేష అంచనాలను సొంతం చేసుకుంటోంది.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!