

అక్కినేని నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న 100వ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దర్శకుడు ఆర్ ఏ కార్తిక్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం కీలక ప్రకటన చేస్తూ సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ పనిచేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ వార్తతో అక్కినేని అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. మరోసారి ఈ విజయవంతమైన కలయిక తెరపై మాయ చేయబోతోందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో నాగార్జున, దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాల పాటలు, నేపథ్య సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు నాగ్ 100 వ చిత్రానికి కూడా అదే స్థాయి సంగీతాన్ని అందించనున్నారనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ వేగంగా సాగుతుండగా, చిత్రబృందం తదుపరి అప్‌డేట్లపై కూడా ఆసక్తి నెలకొంది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. కథ, సాంకేతిక విలువలు, సంగీతం అన్నీ కలిసొచ్చేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!