

రాస్రా ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై ‘ఆఫ్టర్ ఇంజనీరింగ్’ అనే కొత్త తెలుగు చిత్రం తెరకెక్కుతోంది. రాజు బొనగాని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజు బొనగాని.. ఈ చిత్రంతో దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నూతన నటీనటులను పరిచయం చేస్తూ ఈ సినిమాను యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు.

ప్రేమ, భావోద్వేగాలతో కూడిన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం యువతకు కనెక్ట్ అయ్యేలా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. “థిస్ ఈజింట్ జస్ట్ మై స్టోరీ, ఇట్స్ అవర్ స్టోరీ” అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా ప్రతి ఒక్కరి అనుభవాలకు దగ్గరగా ఉంటుందని దర్శకుడు రాజు బొనగాని తెలిపారు. ప్రస్తుతం పాటల రికార్డింగ్ జరుగుతోంది. త్వరలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి నటీనటులు, సాంకేతిక బృందం సహా సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!