12, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ ట్రైలర్ విడుదల

Writer: Pooja 09:42 AM, 11 నవంబర్, 2026
సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ ట్రైలర్ విడుదల

ఎన్నో అడ్డంకులను అధిగమించిన తర్వాత సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన మాతృభూమి సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇందులో సల్మాన్ ఖాన్ దేశ రక్షణ కోసం సరిహద్దులో పోరాడే సైనికుడిగా కనిపించడంతో పాటు, భార్యాపిల్లలతో ఆనందంగా జీవించే కుటుంబ వ్యక్తిగా కూడా అలరించనున్నారు. నటి చిత్రాంగదా సింగ్ ఈ సినిమాలో సల్మాన్ భార్య పాత్రను పోషించారు. సైనికుడిగా ఆయన ఎదుర్కొనే సవాళ్లతో పాటు కుటుంబంతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని కూడా ట్రైలర్‌లో చూపించారు.

2020లో భారత్‌-చైనా సైనికుల మధ్య జరిగిన గల్వాన్ ఘర్షణల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. తొలుత ఈ చిత్రానికి బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ అనే టైటిల్‌ను ఖరారు చేయగా, ఆ తర్వాత మాతృభూమిగా మార్చుతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. భారత రక్షణ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు దర్శకుడు అపూర్వ లఖియా సినిమాలో దాదాపు 40 శాతం భాగాన్ని మళ్లీ చిత్రీకరించినట్లు సమాచారం. కొత్త వెర్షన్‌లో కొన్ని కల్పిత అంశాలు, రొమాంటిక్ సన్నివేశాలు, పాత్రల నేపథ్యాన్ని వివరించే అదనపు కథాంశాన్ని చేర్చినట్లు తెలుస్తోంది. కథనాన్ని మరింత విస్తృతంగా రూపొందించేందుకు ఈ మార్పులు చేసినట్లు సమాచారం. తాజాగా ట్రైలర్ విడుదల కావడంతో గల్వాన్ ఘర్షణల నేపథ్యంలోని ఈ కథలో సల్మాన్ ఖాన్‌ను తెరపై చూసేందుకు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు

పెళ్లి బంధంతో ఒక్కటైన అనిరుధ్–కావ్య

పెళ్లి బంధంతో ఒక్కటైన అనిరుధ్–కావ్య

‘ది ప్యారడైజ్’ టీమ్‌పై సీనియర్ నటుడి ఆగ్రహం

‘ది ప్యారడైజ్’ టీమ్‌పై సీనియర్ నటుడి ఆగ్రహం

అనిరుధ్–కావ్య ప్రపోజల్ వీడియోపై క్లారిటీ

అనిరుధ్–కావ్య ప్రపోజల్ వీడియోపై క్లారిటీ

శర్వానంద్‌ ‘భోగి’ వాయిదా..కొత్త విడుదల తేదీ త్వరలోనే ప్రకటన

శర్వానంద్‌ ‘భోగి’ వాయిదా..కొత్త విడుదల తేదీ త్వరలోనే ప్రకటన

అనిరుధ్ రవిచందర్ ఆస్తుల విలువ ఎంత తెలుసా?

అనిరుధ్ రవిచందర్ ఆస్తుల విలువ ఎంత తెలుసా?

ట్యాగ్లు
సల్మాన్ ఖాన్మాతృభూమి సినిమామాతృభూమి ట్రైలర్చిత్రాంగదా సింగ్గల్వాన్ ఘర్షణలుబాలీవుడ్ సినిమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం
జనరల్

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 66: హౌస్‌లో మరచిపోలేని మధుర జ్ఞాపకాలు..
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 66: హౌస్‌లో మరచిపోలేని మధుర జ్ఞాపకాలు..

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ
క్రీడలు

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్
జనరల్

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
జనరల్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున
జనరల్

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు
జనరల్

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం
జనరల్

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం
జనరల్

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!