

టాలీవుడ్ యువ హీరో అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటించిన ‘లెనిన్’ సినిమా ట్రైలర్‌ను జూన్ 30న విశాఖపట్నంలో ఘనంగా విడుదల చేశారు. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ దర్శకుడు అబ్బూరి మురళీకిశోర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు మంచి స్పందన అందుకోగా, తాజా ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
రాయలసీమ నేపథ్యంలోని యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు, ఫ్యాక్షన్ అంశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నాగార్జున అందించిన వాయిస్ ఓవర్ ట్రైలర్‌కు మరింత బలం చేకూర్చింది. “యుద్ధం కూడా ప్రశాంతంగా చేయాలి” అంటూ అఖిల్ చెప్పే డైలాగ్‌తో పాటు సునీల్ చెప్పే సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రగ్గడ్ లుక్‌లో కనిపించిన అఖిల్ నటనపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!