

నందమూరి బాలకృష్ణ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ చిత్రం ‘దాదా’ షూటింగ్ ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి షూటింగ్ ముందుగానే పూర్తికావాల్సి ఉన్నప్పటికీ, బాలకృష్ణ గాయపడటంతో చిత్రీకరణ కొంతకాలం వాయిదా పడింది. అయితే కోలుకున్న వెంటనే బాలయ్య తిరిగి సెట్స్‌లోకి వచ్చి సినిమా ఆలస్యం కాకుండా షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్న మంచు మనోజ్‌కు తాజాగా క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ సమయంలో గాయమైనట్లు తెలుస్తోంది. అయినప్పటికీ షూటింగ్‌కు విరామం ఇవ్వకుండా ఆయన చిత్రీకరణలో పాల్గొంటున్నట్లు సమాచారం. హీరో, విలన్ ఇద్దరూ గాయాల మధ్య కూడా సినిమా పూర్తి చేయడానికి కష్టపడుతుండటం ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!