

ముంబై పోలీసుల సహకారంతో నిర్వహించిన సైబర్ నేరాల అవగాహన కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన కుమార్తె నితారాకు ఎదురైన ఆన్‌లైన్ వేధింపుల ఘటనను వెల్లడించారు. పిల్లలు ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో అపరిచితులతో మాట్లాడేటప్పుడు ఎదురయ్యే ప్రమాదాలను తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని వివరించేందుకు ఆయన ఈ ఘటనను ప్రస్తావించారు.
కొన్ని నెలల క్రితం నితారా వీడియో గేమ్ ఆడుతున్న సమయంలో ఓ అపరిచిత వ్యక్తి ఆమెను ఆన్‌లైన్‌లో సంప్రదించినట్లు అక్షయ్ తెలిపారు. మొదట సాధారణంగా మాట్లాడిన ఆ వ్యక్తి.. ఆమె అబ్బాయా, అమ్మాయా అని అడిగాడని చెప్పారు. నితారా తాను అమ్మాయినని చెప్పిన తర్వాత అతడు అనుచితమైన అభ్యర్థన చేసినట్లు వెల్లడించారు. వెంటనే నితారా గేమ్‌ను ఆపేసి, జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పిందని తెలిపారు. సైబర్ నేరగాళ్లు ముందుగా స్నేహపూర్వకంగా మాట్లాడి పిల్లల నమ్మకాన్ని పొందేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని, ఆ తర్వాత అసలు ఉద్దేశాలను బయటపెట్టవచ్చని అక్షయ్ హెచ్చరించారు. పిల్లలకు చిన్న వయసు నుంచే డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించాలని, తల్లిదండ్రులు వారి ఆన్‌లైన్ కార్యకలాపాల గురించి నిరంతరం మాట్లాడాలని సూచించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!