

ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనను దోషిగా తేల్చి ఏడాది జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా రూ.95 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. సినిమాలతో పాటు పలు వ్యాపార కార్యకలాపాల్లోనూ కొనసాగుతున్న బండ్ల గణేష్‌కు ఈ తీర్పు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
కేసు వివరాల ప్రకారం.. మద్దిరాలపాడుకు చెందిన జెట్టి వెంకటేశ్వరరావుకు చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించి బండ్ల గణేష్ ఇచ్చిన చెక్ బ్యాంకులో నగదుగా మారలేదు. పలుమార్లు డబ్బులు చెల్లించాలని కోరినా స్పందన లేకపోవడంతో బాధితుడు 2019లో కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి కొనసాగుతున్న విచారణ తాజాగా ముగియడంతో న్యాయస్థానం ఈ తీర్పు ప్రకటించింది. అయితే, ఈ తీర్పును పైకోర్టులో సవాలు చేసుకునేందుకు బండ్ల గణేష్‌కు నెల రోజుల గడువు ఇచ్చింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!