

హాస్య కథానాయకుడు అల్లరి నరేష్ తన 65వ చిత్రమైన ‘రంభ ఊర్వశి మేనక’తో మరోసారి వినోదాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ పతాకాలపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం టైటిల్‌తో పాటు ఆకట్టుకునే ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది.
ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ లుక్‌లో అల్లరి నరేష్ స్వర్గ మెట్లపై కూర్చొని, రంభ, ఊర్వశి, మేనక పేర్లు ఉన్న చిట్టాను చేతిలో పట్టుకుని కనిపిస్తారు. ఆయనపై అప్సరసలు తేలియాడుతున్న దృశ్యం ఫాంటసీ వినోదాన్ని సూచిస్తోంది. వెన్నెల కిషోర్, నరేష్ వీకే, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, రామ్ రెడ్డి ఛాయాగ్రహణం, బ్రహ్మ కడలి కళా రూపకల్పన, చోటి కె ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!