

‘సైయారా’ చిత్రంతో కథానాయికగా పరిచయమైన అనీత్ పడ్డా తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శక్తి శాలిని’. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మడాక్ ఫిల్మ్స్ హారర్ యూనివర్స్ నిర్మిస్తోంది. ఇందులో విశాల్ జెత్వా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వార్తలు వెలువడగా.. తాజాగా వేసవి కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.
బెంగాలీ జానపద కథల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో అనీత్ పడ్డా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు ఇతర సాంకేతిక అంశాల విషయంలోనూ చిత్ర బృందం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దుతూ ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించేలా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అనీత్ కెరీర్‌లో మరో కీలక ప్రాజెక్టుగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!