

2027 సంక్రాంతి బాక్సాఫీస్ పోటీ రోజురోజుకూ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండగా, ఇప్పుడు రవితేజ, శ్రీవిష్ణు కలిసి నటిస్తున్న కొత్త మల్టీస్టారర్ కూడా అదే సీజన్‌ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. రాజ రాజ చోర, స్వాగ్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హసిత్ గోలి ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. పూర్తి వినోదాత్మక కథతో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. రవితేజ, శ్రీవిష్ణు కామెడీ టైమింగ్‌ను ప్రధాన బలంగా మలచే కథను దర్శకుడు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి, బాబీ సినిమా, అనిల్ రావిపూడి మల్టీస్టారర్, కింగ్ 100 వంటి చిత్రాలు కూడా సంక్రాంతి బరిలో నిలవనున్నాయి. ఇప్పుడు ఈ కొత్త చిత్రం చేరడంతో వచ్చే ఏడాది పండగ సీజన్లో బాక్సాఫీస్ పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!