
సినిమాలు

గచ్చిబౌలిలో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. త్రిబుల్ ఐటీ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ పనుల కారణంగా 90 రోజుల పాటు ట్రాఫిక్ డైవర్షన్ అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. డీఎల్ఎఫ్ గేట్-1 నుంచి రోడ్డును మూసివేశారు. ఫ్లైఓవర్ పనుల నేపథ్యంలో గచ్చిబౌలిలో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. త్రిబుల్ ఐటీ పరిసరాల్లో ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని పోలీసులు సూచించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!