

చార్మింగ్ స్టార్ శర్వా నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 1960ల ప్రారంభంలో మహారాష్ట్ర–ఆదిలాబాద్ సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో సాగుతుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తుండగా, లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి.
ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కందుల సులోచన రాణి పాత్రలో నటిస్తున్నారు. ఆమె ఫస్ట్ లుక్, పాటల్లో కనిపించిన తీరు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. తాజాగా తన పాత్రకు అనుపమ డబ్బింగ్ పూర్తి చేయగా, డబ్బింగ్ స్టూడియో నుంచి విడుదలైన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. డింపుల్ హయాతి మరో కథానాయికగా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, కిశోర్ కుమార్ సినిమాటోగ్రఫీ, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్షన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘భోగి’ నవంబర్ 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!