

డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాకా’. 2027 జనవరి 13న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా.. చిత్రబృందం వరుస అప్‌డేట్స్‌తో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. తాజాగా బాలీవుడ్ దర్శకనటుడు అనురాగ్ కశ్యప్ ‘కాకా’లో శక్తివంతమైన, కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ కాంబినేషన్‌పై మెగా అభిమానులు సోషల్ మీడియాలో ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు.
‘కాకా’లో చిరంజీవి కదిరి కాళీదాస్ పాత్రలో కనిపించనున్నారు. అనస్వరా రాజన్, నివేతా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను, కన్నడ నటి రచిత రామ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో కొనసాగుతున్నాయి. ‘ది బ్లడీ బెంచ్‌మార్క్’ అనే క్యాప్షన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2027 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!