

తెలుగు కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కమెడియన్లు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వారిలో డేగల బాబు కూడా ఒకరు. ముఖ్యంగా హైపర్ ఆది స్కిట్లలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరించిన బాబు తాజాగా ఓ ఇంటివాడయ్యాడు. గత ఏడేళ్లుగా ప్రేమిస్తున్న అమూల్య అనే యువతిని శుక్రవారం వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను బాబు తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకోగా, తోటి జబర్దస్త్ కమెడియన్లు కూడా వాటిని షేర్ చేశారు. దీంతో ఈ జంటకు అభిమానులు, నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
తొలుత సాధారణ కమెడియన్గా కెరీర్ ప్రారంభించిన డేగల బాబుకు ఆ తర్వాత రచనపై ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో సుమారు మూడేళ్ల క్రితం 'ప్రేమ్ వాలంటీర్' పేరుతో యూట్యూబ్ సిరీస్ను రూపొందించాడు. ఇటీవల కమెడియన్ హర్ష ప్రధాన పాత్రలో నటించిన 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' వెబ్ సిరీస్కు దర్శకత్వం వహించాడు. ఈ సిరీస్ ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి వినోదాన్ని అందించింది. ఇలా కమెడియన్గా, రచయితగా, దర్శకుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న బాబు తాజాగా అమూల్యను పెళ్లి చేసుకుని జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. ఈ సందర్భంగా తోటి కమెడియన్లు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!