

కోలీవుడ్ యంగ్ హీరో అర్జున్ దాస్ తన విలక్షణమైన నటనతో పాటు గంభీరమైన వాయిస్‌తో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవల వచ్చిన ‘కాన్ సిటీ’ చిత్రం ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం రాలేదు. అయితే నిరాశ చెందకుండా కేవలం నెల రోజుల్లోనే మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘వన్స్ మోర్’ చిత్రానికి విఘ్నేష్ శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అదితి శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్న ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామా ప్రేమ, భావోద్వేగాలు, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసిన ఈ చిత్రం ఆగస్ట్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!