

బాలీవుడ్ యంగ్ స్టార్ కార్తీక్ ఆర్యన్, దర్శకుడు కబీర్ ఖాన్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వీరిద్దరి కలయికలో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి , లడకు అనే టైటిల్‌ను ఖరారు చేశారు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన చందూ ఛాంపియన్ భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయినప్పటికీ ఈ జోడీ మరోసారి సరికొత్త కథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోనుంది.
నిజ జీవితంలో జరిగిన కొన్ని అసాధారణ సంఘటనల ఆధారంగా , లడకు చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఆశయం, పట్టుదల, ఆశ వంటి అంశాల చుట్టూ సాగే ఈ కథ స్ఫూర్తిదాయకంగా ఉండనుందని తెలుస్తోంది. బిర్లా స్టూడియోస్, కబీర్ ఖాన్ ఎంటర్టైన్మెంట్స్, డోపమైన్ స్టూడియోస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో కార్తీక్ ఆర్యన్ హీరోగానే కాకుండా నిర్మాతగానూ తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుండటం విశేషం. ఈ భారీ చిత్రాన్ని 2027 జూన్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!