

తెలంగాణ ఫోక్ సాంగ్స్ ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. ఈ జాబితాలో ‘బాసింగా బలాలు’ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫోక్ డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, వైష్ణవి జంటగా నటించిన ఈ పాట కేవలం రెండు నెలల్లోనే 86 మిలియన్ వ్యూస్ దాటినట్లు సమాచారం. తెలంగాణ యాస, పల్లెటూరి పదాలు, క్యాచీ బీట్, సులభమైన డ్యాన్స్ స్టెప్పులతో ఈ పాటకు భారీగా ఆదరణ లభిస్తోంది. పాటకు సంబంధించిన రీల్స్, షార్ట్స్ కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
కొరియోగ్రాఫర్ శేఖర్ వైరస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘బాసింగా బలాలు’ పాటను సుమారు రూ.11 లక్షల బడ్జెట్‌తో రూపొందించారు. ఇందులో ఆర్టిస్టులు, కొరియోగ్రాఫర్, డీఓపీ రెమ్యునరేషన్లతో పాటు లొకేషన్ సెటప్, ప్రాపర్టీస్, రిహార్సల్స్, భోజనం, ప్రమోషన్స్ వంటి ఖర్చులు ఉన్నాయి. సామాన్యులు, ముఖ్యంగా మహిళలు సైతం సులువుగా అనుకరించేలా హుక్ స్టెప్పులు రూపొందించడమే పాట విజయానికి ప్రధాన కారణమని శేఖర్ తెలిపారు. పాటకు వచ్చిన ఖచ్చితమైన రెవెన్యూను అధికారికంగా వెల్లడించకపోయినా, నివేదికల ప్రకారం రూ.25 లక్షలకు పైగా ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!