
సినిమాలు

శర్వానంద్ నటిస్తున్న ‘భోగి’ సినిమా ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోంది. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో సాగుతోంది. ఇప్పటికే విడుదలైన పాత్రల పోస్టర్లు, ప్రచార కార్యక్రమాలు సినిమాపై మంచి ఆసక్తిని పెంచాయి.
ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. క్లైమాక్స్ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన భారీ సెట్లో కీలక యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు. స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షణలో సుమారు 20 రోజుల పాటు ఈ సన్నివేశాలు తెరకెక్కనున్నాయి. భావోద్వేగాలతో పాటు గట్టి యాక్షన్ అంశాలను మేళవిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 28న రాఖీ కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!