

బాలీవుడ్ నటి అంకితా లోఖండే తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్నట్లు చెప్పిన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని తాజాగా వెల్లడించారు. హీరోయిన్ కావాలనే కలతో 19 ఏళ్ల వయసులోనే సినిమా రంగంలోకి వచ్చిన ఆమె, ఓ ఆడిషన్ తర్వాత తనను ఎంపిక చేసినట్లు చెప్పి కాంట్రాక్ట్ సంతకం చేసేందుకు కార్యాలయానికి పిలిచారని గుర్తుచేసుకున్నారు. ఆ అవకాశం దక్కిందన్న ఆనందంతో వెంటనే తన తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పినట్లు అంకితా తెలిపారు.
అయితే కార్యాలయానికి వెళ్లిన తర్వాత తన కోఆర్డినేటర్‌ను బయటే ఉంచి తనను మాత్రమే లోపలికి పిలిచారని ఆమె పేర్కొన్నారు. అక్కడ తనను ‘కాంప్రమైజ్’ కావాలని అడిగారని, దాని అర్థం ఏమిటని ప్రశ్నించగా నిర్మాతతో శారీరక సంబంధం పెట్టుకుంటే అవకాశం ఇస్తామని నేరుగా చెప్పారని అంకితా ఆరోపించారు. ఈ డిమాండ్‌ను తాను తీవ్రంగా తిరస్కరించి, అక్కడి నుంచి బయటకు వచ్చానని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి డిమాండ్ చేయడానికి ఎవరూ సాహసించకూడదని అప్పుడే నిర్ణయించుకున్నానని ఆమె తెలిపారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు అంకితాకు మద్దతు తెలుపుతున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!