

వీఎఫ్‌ఎక్స్ విజువల్స్‌తో తెరకెక్కిన పౌరాణిక ఇతిహాస చిత్రం రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి ఎక్కువగా సానుకూల స్పందనను అందుకుంటోంది. సుమారు రూ.2,000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా సినిమాలోని కీలక క్లైమాక్స్ సన్నివేశానికి సంబంధించిన గ్లింప్స్‌ను శ్రీ హనుమాన్ చాలీసా వీడియో సాంగ్ ద్వారా యూట్యూబ్‌లో విడుదల చేసింది. తొలి భాగం చివర్లో హనుమంతుడిగా సన్నీ డియోల్ పరిచయమవుతారు. అయితే ఆ సన్నివేశంలో ఆయన ముఖాన్ని చూపించలేదు. తాజాగా విడుదలైన వీడియో సాంగ్‌లో ఈ కీలక ఘట్టాన్ని చూపించడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
హనుమంతుడి లంకాదహనం, శ్రీరాముడిపై ఆయనకున్న భక్తి, చెడుపై ఆయన చేసే పోరాటాన్ని వెండితెరపై చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఘట్టాల కోసం 2028 వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. నితేశ్ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి హాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. భారీ విజువల్స్‌తో రూపొందిన ఈ ఇతిహాస కథలో హనుమంతుడి పాత్ర తదుపరి భాగంలో మరింత కీలకంగా ఉండనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!