

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొల్లి బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’ ఆయన ప్రస్తుత చిత్రాల్లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలుస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. టైటిల్ గ్లింప్స్‌లో చిరంజీవిని సింపుల్ లుక్‌లో చూపించినప్పటికీ, సినిమాలో ఆయనను మరిన్ని విభిన్న గెటప్స్‌లో చూపించే అవకాశం ఉందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
తాజాగా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఏషియన్ సునీల్ స్వగృహానికి వెళ్లిన చిరంజీవి క్యాప్ ధరించి, రఫ్ లుక్‌లో కనిపించారు. ముఖ్యంగా మెలితిప్పిన మీసంతో ఉన్న ఆయన గెటప్ ‘కాకా’లోని పాత్రకు సంబంధించినదేనా అనే చర్చ మొదలైంది. దీంతో దర్శకుడు బాబీ సినిమాలో మరో ప్రత్యేకమైన లుక్‌ను ప్లాన్ చేశారా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!