
రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకోసం ఆయన తన స్వగ్రామమైన గుంటూరు జిల్లా పెదకాకణికి చేరుకున్నారు. అక్కడి జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేశారు. పరిషత్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న వేళ బోయపాటి తన స్వగ్రామానికి వచ్చి ఓటు వేయడం స్థానికంగా ఆసక్తిని కలిగించింది.
ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం బోయపాటి శ్రీను ఓటర్లకు కీలక సూచన చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటు ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటింగ్‌లో పాల్గొనాలని ఆయన సూచించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!