
సినిమాలు

పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రోనాల్డో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు సమాచారం. రెండు దశాబ్దాలకు పైగా సాగిన తన సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలుకుతున్నట్లు వీడియో సందేశం ద్వారా వెల్లడించినట్లు తెలుస్తోంది. 2003లో పోర్చుగల్ జాతీయ జట్టు తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రోనాల్డో.. తన అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.
పోర్చుగల్ తరఫున అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా, అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఫుట్‌బాలర్‌గా రోనాల్డో రికార్డులు నెలకొల్పారు. తన కెరీర్లో ఐదుసార్లు ప్రతిష్ఠాత్మక బాలన్ డి ఓర్ అవార్డును అందుకున్నారు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు ఆయన వీడ్కోలు పలికినట్లు వస్తున్న వార్తలు నిజమైతే, ప్రపంచ ఫుట్‌బాల్‌లో ఒక గొప్ప శకం ముగిసినట్లే.





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!