
జనరల్

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో మరో చిత్రం తెరకెక్కుతోంది. వాల్తేరు వీరయ్య తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేస్తున్న ఈ సినిమాను ప్రస్తుతం మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. గతంలో ఈ సినిమాకు కాకాజీ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే చిరంజీవి తనదైన శైలిలో మరోసారి ‘చిరు లీక్స్’ పేరుతో సినిమా టైటిల్‌పై హింట్ ఇచ్చారు. కొరియన్ కనకరాజు ఈవెంట్లో యాంకర్ ప్రశ్నకు సమాధానం ఇస్తూ సంగీత దర్శకుడు తమన్‌తో మాట్లాడిన చిరంజీవి.. “సేమ్ టైటిల్ కదిరి...” అంటూ మధ్యలోనే ఆపేశారు. దీంతో ఈ సినిమాకు కదిరి నరసింహుడు అనే టైటిల్‌ను ఖరారు చేయనున్నారనే ప్రచారం మొదలైంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!