

దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ సినిమాను వీక్షించిన ఆమె సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. కథాంశం, భావోద్వేగ సన్నివేశాలు, సమాజానికి అందించిన స్ఫూర్తిదాయకమైన సందేశం తనను ఆలోచింపజేశాయని తెలిపారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి తప్పక చూడాల్సిన చిత్రమని అభిప్రాయపడ్డారు.
ఆడపిల్లల కలలకు తల్లిదండ్రుల నమ్మకం, ప్రోత్సాహం తోడైతే సమాజం విధించే హద్దులను అధిగమించవచ్చనే సందేశాన్ని ఈ సినిమా అందించిందని అనిత పేర్కొన్నారు. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి తమ సహజ నటనతో పాత్రలకు ప్రాణం పోశారని ప్రశంసించారు. దర్శకుడు పవన్ సాధినేనికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే స్వప్న సినిమా నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌తో పాటు చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు తెలియజేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!