

కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డోరతీ’పై దర్శకుడు మిస్కిన్ చేసిన ప్రశంసలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. సినిమా థ్యాంక్స్ మీట్‌లో మాట్లాడిన మిస్కిన్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ‘ది ఒడిస్సీ’తో ‘డోరతీ’ని పోల్చారు. ‘ది ఒడిస్సీ’ కంటే ‘డోరతీ’ వంద రెట్లు మెరుగ్గా ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సినిమా వసూళ్ల కంటే కళాత్మక ప్రతిభకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. గతంలో కార్తిక్ సుబ్బరాజ్ చిత్రాన్ని చూసి బోర్‌గా అనిపించిందని, ‘డోరతీ’తో ఆయనపై తన అభిప్రాయం పూర్తిగా మారిందని తెలిపారు.
కార్తిక్ సుబ్బరాజ్ సినిమాను తెరకెక్కించిన తీరును మిస్కిన్ ప్రత్యేకంగా ప్రశంసించారు. సంగీత దర్శకుడు ఇళయరాజాపై తనకున్న అభిమానంతో కార్తిక్ సుబ్బరాజ్‌పై ఉన్న గౌరవాన్ని పోల్చుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ‘డోరతీ’పై ఆయన చేసిన పోలికకు సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు ఆయన ప్రశంసలను అభినందిస్తుండగా, మరికొందరు ఈ పోలిక అతిగా ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఆయన పదో సినిమా కాగా, ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. రిషికాంత్, సనాతన్, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!