
జనరల్

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్‌ను ఘనంగా జరుపుకోవాలని చిత్రబృందం నిర్ణయించింది. మంగళవారాన్ని తమ గ్యాంగ్‌కు అధికారికంగా ‘సెలబ్రేషన్ డే’గా ప్రకటించింది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని హోటల్ దస్పల్లాలో మధ్యాహ్నం 3 గంటల నుంచి బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ అమెరికాలోనూ ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని నటీనటులు, సాంకేతిక బృందం సభ్యులంతా సక్సెస్ పార్టీలో పాల్గొని సందడి చేయనున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!