

మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘96’, ‘మేయళగన్’ వంటి భావోద్వేగ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సి. ప్రేమ్‌కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ‘అసరీరి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఫహద్‌తో ప్రేమ్‌కుమార్ థ్రిల్లర్ రూపొందిస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది.
ఈ చిత్రాన్ని 2027 జనవరి 1న నూతన సంవత్సర కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ 32వ ప్రాజెక్టుగా డాక్టర్ ఇషారి కె. గణేష్, మాన్సూన్ మూవీస్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో శివద, చేతన్, గీత, హరీష్ ఉత్తమన్, కరుణాకరన్, శరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘96’, ‘మేయళగన్’ చిత్రాలకు సంగీతం అందించిన గోవింద్ వసంత ఈ సినిమాకూ స్వరాలు సమకూరుస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!