

తిరుపతి సమీపంలోని ఆంజనేయపురంలో శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయడంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన భక్తుల విశ్వాసాలను దెబ్బతీసిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఆలయాల కూల్చివేతలు కొనసాగుతున్నాయని ఆరోపిస్తూ చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ మేరకు సోమవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
గతంలో తిరుమలలో చారిత్రక వెయ్యికాళ్ల మండపం కూల్చివేత, కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో 40 ఆలయాల తొలగింపు, బద్వేలులోని కాశినాయన జ్యోతిక్షేత్రంలో జరిగిన కూల్చివేతలను జగన్ ప్రస్తావించారు. ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించకుండానే పవిత్ర కట్టడాలను తొలగిస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ కోసం శ్రీవాణి ట్రస్ట్‌ను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆలయాలను కూల్చివేయడం సమంజసమేనా అని ప్రశ్నించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!