

ఫహాద్ ఫాజిల్ నటుడిగానే కాకుండా నిర్మాతగానూ తన సత్తా చాటుతున్నారు. ఆయన నిర్మాణ సంస్థ భవన స్టూడియోస్ వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈ బ్యానర్ నుంచి వచ్చిన ‘ప్రేమలు’, ‘ఆవేశం’, ‘బెత్లెహెమ్ కుడుంబ యూనిట్’ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా కలిపి రూ.550 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇందులో ‘ప్రేమలు’ సుమారు రూ.130 కోట్లు, ‘ఆవేశం’ రూ.155 కోట్లు, ‘బెత్లెహెమ్ కుడుంబ యూనిట్’ దాదాపు రూ.310 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.
ఈ వరుస విజయాల్లో కథలు, జానర్లు భిన్నంగా ఉండటం ప్రత్యేకంగా నిలుస్తోంది. సంప్రదాయ స్టార్ పవర్‌పై మాత్రమే ఆధారపడకుండా, విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న చిత్రాలు భవన స్టూడియోస్‌కు మంచి బాక్సాఫీస్ ట్రాక్ రికార్డ్‌ను అందిస్తున్నాయి. వరుసగా మూడు ప్రధాన విజయాలతో మలయాళ చిత్ర పరిశ్రమలో భవన స్టూడియోస్ తన నిర్మాణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!