

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల జాబితాపై మరోసారి సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు కోమల్ నహతా బన్నీ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ప్రస్తావించడంతో ఉత్తరాది ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రాకా సినిమా చేస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా, భారీ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతోంది. 2027 డిసెంబర్‌లో విడుదల చేయాలని భావిస్తున్నారు. మరోవైపు లోకేష్ కనగరాజ్‌తో చేయనున్న ఏఏ23పై కూడా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారానికి దర్శకుడు తన ఫొటోతో తెరదించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో అనిరుధ్ సంగీతం అందించనున్నారు.
ఇక సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్, బేసిల్ జోసెఫ్‌లతోనూ బన్నీ సినిమాలు చేయాల్సి ఉంది. సుకుమార్‌తో మరో చిత్రం, పుష్ప 3 కూడా చర్చల్లో ఉన్నాయి. ఇంతమంది అగ్ర దర్శకులతో ప్రాజెక్టులు సిద్ధంగా ఉండటంతో అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. అయితే ఈ సినిమాలన్నీ పూర్తవడానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చని కొందరు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు పాన్ ఇండియా స్థాయిని దాటి అంతర్జాతీయ మార్కెట్‌పై దృష్టి పెట్టడం బన్నీ ప్రత్యేకతగా కనిపిస్తోంది. సరైన ప్రణాళికతో ముందుకెళ్తే రాబోయే సంవత్సరాల్లో ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!